Saturday 1 February 2014

విద్యలో ప్రాధమిక అంశాల్లో మీ పిల్లల స్థితి ఎలా ఉంది?

                  తల్లి దండ్రులకు పిల్లల పై ఎన్నో ఆశలు ఉంటాయి.వారి భవిష్యత్తును గురించి ఎంతో ఊహించుకుంటారు. కానీ తమ పిల్లలకు చిన్న చిన్న అంశాలలో ఎంత పట్టు ఉందో తెలుసుకోరు.ప్రాధమిక విద్యలో "ప్రధం" అనే స్వచ్చంద సంస్థ సర్వే వివరాలు ఆశ్చర్యాన్నికలిగిస్తాయి.తరగతి వారీ ప్రమాణాల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని తెలియజేసింది.
         ఫ్రెండ్ ఫౌండేషన్ సంస్థ విద్యార్థులు తమ మాతృ భాష పై మరియు గణితం లోని నాలుగు ప్రక్రియలైన కూడిక తీసివేత,గుణకారం,భాగహారంల పై ఎంత పట్టు కలిగి ఉన్నారనే అంశం పై  దృష్టి పెట్టింది.చదువులో ప్రాధమిక విష యాలను బాగా నేర్పించాలని,అందుకు విద్యార్థులను,ఉపాధ్యాయులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో చిన్న పరీక్షను మా స్వగ్రామమైన సానికవరం primaryschool( gen) లో నిర్వహించగా 3,4,5 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు D.Basha గారు పరీక్ష నిర్వహించారు.తెలుగులో dictation,మరియు లెక్కలలో నాలుగు ప్రక్రియల పై జరిపారు. తరగతికి 5 గురు చొప్పున బాగా వ్రాసిన వారికి బహుమతులను january 26 సందర్భంగా మా అమ్మగారైన ఒద్దుల విజయలక్ష్మి గారితో అందించటం జరిగింది. విద్యార్థులు చాలా వరకు బాగా వ్రాసారు. బాషా గారు బాగా కృషి చేస్తున్నారు.
           మీరు కూడా మీ పిల్లలు చదివే schools  ప్రాధమిక అంశాలపై ఏ మేరకు దృష్టి పెడుతున్నాయో గమనించి వాటి పట్ల విద్యా సంస్థలు కృషి చేసే విధంగా సలహా ఇవ్వండి.ఈ  విషయం పై తల్లిదండ్రులు శ్రద్ధ తీసికొనగలరు.     

No comments:

Post a Comment