Tuesday, 19 May 2015

అనాధ బాలలకు మార్గం చూపే "మార్గ్ "

                   అనాధ పిల్లలకు ఆసరా ఇచ్చే లక్ష్యం తో 2007 డిసెంబర్ లో వినుకొండలో ప్రారంభ మయ్యింది ఈ సంస్థ దీనిని స్థాపించిన వారు  ఉపాధ్యాయుని గా పనిచేస్తున్న పటాన్ కరీముల్లాఖాన్. ముందుగా వినుకొండ  మండలం లోని  అన్ని పాటశాలలకు ఉత్తరం వ్రాసాడు.  అనాధ బాలలు ఉంటె తెలపమని అలా గుర్తించిన పిల్లలను నైస్ అనే పాటశాలలో చేర్పించాడు .తరువాత సంస్థకు చేయూత నందించ టానికి ఎంతోమంది ముందుకొచ్చారు అప్పుడు అనాధ బాలల సేవా సంస్థను Marg-way to bright future గా సంస్థ పేరును మార్చారు .
            ప్రస్తుతం ఈ సంస్థలో 2000 మంది సభ్యులున్నారు . ప్రధాన కేంద్రం వినుకొండలో ఉంది.ఎక్కడ అనాధ పిల్లలున్నారో సభ్యులు తెలియజేస్తే అక్కడికి వెళ్లి వారి వివరాలు సేకరించి వారిని తీసుకు వచ్చి గుంటూరు ,ప్రకాశం జిల్లాలలోని నైస్ ,saikrishana ఆశ్రమం ,వెంకటేశ్వర బాల కుటీర్,లిటిల్ హార్ట్ చిల్ద్రెన్  వంటి స్కూల్స్,సంస్థ లలో చేర్పిస్తుంటారు.ఇప్పటివరకు 430 మంది చిన్నారులు ఆయా సంస్థల్లో చదువుకుంటున్నారు. జీవితం లో స్థిరపడే వరకు ఆ పిల్లల బాధ్యతను మార్గ్ తీసుకుంటుంది.పసి పిల్లలను కూడా మహిళా శిశు సంక్షేమ సంఘానికి అందిస్తుంటుంది.సంస్థలో చేరేందుకు రూ 100 ప్రవేశరుసుము ఉంటుంది.వారిచ్చే విరాళాలతోనే సంస్థ నడుస్తుంటుంది .కొందరు ప్రతి రూ200 విరాళం ఇస్తుంటారు.ఈ సంస్థ సేవలు నచ్చడంతో ఉన్నతాదికారులు కూడా ఇందులో చేరుతున్నారు.
          అనాధల జీవితాలను సమూలంగా మార్చాలని ,అనాధలు లేని సమాజం చూడాలని ఖాన్ మరియు సంస్థ కోశాధికారి నాగరాజు చెబుతారు . 

Wednesday, 28 May 2014

ఉపాధి చూపించే "ఉన్నతి"

                         చదువుకోవటానికి తను పడ్డ కష్టం ఎవరు పడకూడదు అని BTECH చదివి వ్యాపారం చేసుకునే BANGALORE కు చెందిన రమేష్ కు అనిపించింది.10 సంవత్సరాల నుండి 3000 మంది విద్యార్థులను చదివించాడు.వారిలో చాలా మంది మధ్యలోనే బడి మానివేయటం మొదలు పెట్టారు.ఇలా లాభం లేదనుకుని బ్రతుకు తెరువు చూపించే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు .ఉద్యొగం లేకుండా ఖాళీగా ఉన్న వారందరికీ ఉన్నతి అనే ఈ సంస్థలో 70 రోజుల శిక్షణ ఇస్తారు.భోజనం వసతి అన్నీ ఉచితమే .ఇప్పటి వరకు 1800 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించారు.దాతలు ముందుకు వస్తే మరింత మందికి సహాయం చేస్తాను అంటున్నాడు రమేష్
ఈ వెబ్సైటు  లో వీరిని సంప్రదించండి . unnatiblr.org
ఫోన్:080-25384642
09844085864 

Monday, 12 May 2014

బాలలకు భరోసా "దివ్యదిశ"

            పిల్లలు ఇల్లు వదిలి బయటకు పారిపోవటం అంటే వారికి ఆ  ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో కదా!పేదరికం ,బలవంతపు బాల్య వివాహం ,సవతి తల్లి సతాయింపు లాంటి ఇబ్బందులెన్నో! అమ్మ ,నాన్న కొట్టారని ,పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇంటినుంచి పారిపోతుంటారు.ఇలా వీదినపడ్డ బాల్యానికి రక్షణ కల్పించి దిశా నిర్దేశం చేసే వాళ్ళెవరు ?
          దివ్యదిశ అనే సంస్థను స్థాపించి ఇప్పటివరకు 10 లక్షల మంది బాలల జీవితాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో
ప్రభావితం చేసారు ఎసిడోర్ ఫిలిప్స్.ఎక్కడయినా  పిల్లలు అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి ఫోన్ చేయవచ్చు. హైదరాబాద్ లో ఈ సంస్థకి నాలుగు,మహబూబ్ నగర్ లో ఒకటి మెదక్ లో ఒకటి పునరావాస కేంద్రాలను ఈ సంస్థ నడుపుతుంది.గడప దాటే పిల్లలనే కాదు ఇంట్లో ఉంటూనే అభద్రతకు గురవుతున్న బాలలను రక్శించేందుకు హైదరాబాద్ లో 1098 అనే  helpline ను ఏర్పాటు చేసింది ఈ సంస్థ.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలకోసం tollfree number(18004253525) కు ఫోన్ చేయవచ్చు అలాంటి పిల్లల గురించి తెలిస్తే ఎవరయినా సమాచారాన్ని అందించవచ్చు.
( నేను  ఫిలిప్స్ గారి సెమినార్ కు ఒక సారి హాజరయి ఆయనతో మాట్లాడాను)
ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అను బంధం లోనిది వారికి ధన్యవాదాలు )
ఈ సంస్థ website ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి
divyadisha.org  

Monday, 7 April 2014

అడవి బిడ్డలకు ఆపద్భాందవుడు

             వైద్య వృత్తిని అభ్యసించిన H. సుదర్శన్ కు ఏ మూలో అసంతృప్తి. నాటు వైద్యం తప్ప మరో దిక్కు లేని గిరిజనులకు తన సేవలు అందించాలని తపించాడు. ముప్పై ఏళ్ళ నుండి కర్నాటక  రామరాజ నగర జిల్లాలోని బిళగిరి రంగనహిల్స్ కు వచ్చి 150 గిరిజన గ్రామాలను అభివృద్ది పధం లో నడిపించారు.10 లక్షల మందికి వైద్యం అందించారు .
        అక్కడ 500 మంది పిల్లలకు విద్యనందిస్తున్నారు. కరుణ trust ను స్థాపించి  కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ ,అరుణాచల ప్రదేశ్ ,మేఘాలయ, అండమాన్, మణిపూర్  ప్రభుత్వాల సహకారంతో 50 హాస్పిటల్స్ ఏర్పాటు చేసారు.అబ్దుల్ కలాం,రాహుల్ గాంధీ ఆయన సేవను అభినందించారు ఈయన కృషికి గాను rightlivelyhood,పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.
వివరాలకు vgkk.org website ను సందర్శించండి . ఫోన్ :09448077487  

Tuesday, 1 April 2014

10 revolution

                సహాయం చేయటానికి ఎక్కువ డబ్బు  కావాలి మనమేమి చేస్తాములే అనుకుంటూ ఉంటాం.కాని ఎంత          చిన్న మొత్తంతో  నైనా సహాయం  వచ్చు అని మార్కాపూర్ లోని ideal&krishnachaithanya degree college  విద్యార్థులు  నిరూపించారు .ప్రతి నెల ప్రతి విద్యార్ధి 10 రూపాయల సహాయంతో నెలకొక  కార్యక్రమాన్ని చేస్తున్నారు  ఈ కార్యక్రమాన్ని నాగమురళి ,sk ఉస్మాన్ భాషా అనే ఇద్దరు   lecturers ఆధ్వర్యంలో రామస్వామి , మహేష్ ,ప్రియాంక,దుర్గ,నవీన్, చంద్రశేఖర్,రసూల్, ప్రసన్న , ఫరూక్ ల నాయకత్వం లో ideal students activity cell బ్యానర్ క్రింద   ఇప్పటికి 8 సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
               ఇందులో రోగులకు పండ్లు పంచటం, అనాధలకు నిత్యావసరాలు  అందించటం నీలం  లక్ష రూపాయల నగదు 10 బస్తాల బియ్యము ,బట్టలు సేకరించి అందించటం,,విజయవాడ బుడమేరు ముంపు  బాధితులను ఆదు కోవటం,మానసిక వికలాంగులకు సహాయం చేయటం ,వ్రుధ్ధాశ్రమానికి ,బీద విద్యార్థులకు సహాయం చేయటం ప్రభు త్వ పాటశాలకు  విరాళం ఇవ్వటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తామెవరికి తీసిపోమనినిరూపిస్తున్నారు.    అన్ని విద్యా సంస్థలు వీరిని ఆదర్శంగా తీసు కుంటారని భావిద్దాము.            
IDEALACTIVITYCELL 

Monday, 31 March 2014

S.C ,B.C HOSTELS లో 10 వతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

                S .C,B.C Hostels లోని 10 వ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్రారంభానికి ముందు ముఖ్యమైన సబ్జక్ట్స్ అయిన maths,english ,physical  science లందు ముఖ్యమైన సూచనలు,సలహాలు ఇచ్చి పరీక్షలకు సంసిద్ధులను చేయటం జరిగింది . maths తరగతులు P.Anand,B.Uday kumar తీసుకున్నారు . ఆనంద్ అందరు విద్యార్థులకు తాను తయారుచేసిన material xerox చేసి అందించారు .physicalscience తరగతి లో నేను  వారికి సూచనలు చేసి material xerox చేసి అందించాను.english తరగతిని sivaprasad  తీసుకున్నారు వీరందరూ స్వచ్చందంగా ముందుకు  వచ్చి classes తీసుకున్నందుకు Friendsfoundation వారిని  అభినందిస్తుంది .   

Sunday, 30 March 2014

సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము

వేసవి  రాగానే చల్లని  పానీయాల వైపు మనసు మళ్ళుతుంది.శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియం
 లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2)మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర  కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12  లభిస్తాయి.
3)సబ్జా నీరు: మహిళలకు అవసర మయ్యె పాలేట్,నియాసిన్,చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ ఇ అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4)పుచ్చకాయ : గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A   ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN  సూర్యరశ్మి లోని U.V  కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
5) తాటి ముంజలు :6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
6) నిమ్మరసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ
7)చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి .ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.
8) రాగి జావ: ఇది acidity ని తగ్గిస్తుంది.
       ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు .
(జనవిజ్ఞానవేదిక సౌజన్యంతో )