Sunday 19 January 2014

FRIENDS FOUNDATION అనే నూతన బ్లాగ్ ప్రారంభం


            భూమి మీద జీవం మనుగడ  సాగించడానికి సూర్యుడే ఆధారం.సమస్త ప్రాణికోటికి వృక్ష జాతికి సూర్యుడే మిత్రుడు.నిరంతరం వెలుగులు చిమ్ముతూ కాంతిని,ఉష్ణ శక్తిని మన కందిస్తున్న సూర్యుడంటే మొదటినుంచి మనిషి కెంతో ఆరాధన.అటువంటి సూర్యుడి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు.తాను ఏమీ ఆశించకుండా ఇవ్వట మే ధర్మంగా గల సూర్య తత్వం ఆదర్శంగా మనిషి తీసుకొంటె ఈ ప్రపంచం ఎం త ఆదర్శవంతంగా మారుతుందో కదా! విశ్వానికి,ముఖ్యంగా మన భూమికి ఆయన స్నేహితుడు.ఆయనను విశ్వామిత్ర గా కూడా భావించవచ్చు . ఇదంతా మనకు ప్రేరణ కలిగించే  కోణంలో ఆలోచిస్తే మన కనిపిస్తుంది.సైన్స్ ప్రకారం అదొక నక్షత్రం.విశ్వ పరిణామ క్రమంలో ఏర్పడిన ఒక మధ్యతరగతి నక్షత్రం.
             ఇక స్నేహితుడు  గురించి ఆలోచిస్తే హితము కోరువాడు అని అర్థం వస్తుంది.ఇతరులకు అపకారం కలిగించ కుండా,అవతలి వారి మేలు కోరుతూ చేతనయితే వీలయినంత సహాయం చేయ గలవాడే స్నేహితుడు.ఈ స్నేహ ధర్మం ప్రకృతి నుండే మనం అర్థం చేసుకోవచ్చు.అందుకే మొదటగా సూర్యుడి గురించి వ్రాసింది.అటు వంటి సూర్య తత్వం,స్నేహ గుణం కలిగిన వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది వారే స్నేహితులు,మిత్రులు అవుతారు.ఇది వ్యక్తిగత స్థాయిలో ఉంటుంది. దీనిని సమాజానికి విస్తరిస్తె ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుండి వచ్చిందే ఈ
Friendsfoundation.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకునే స్నేహితులు కలిసి సమాజానికి సేవ చేయాలనే సంకల్పా న్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుంది అన్న భావన నుంచి ఉదయించిందే ఈ సంస్థ.సంస్థ అనే కంటే ఇదొక వేదిక .దీనికి అధ్యక్ష కార్యదర్శులేమీ ఉండరు.కేవలం కార్యనిర్వాహకులు మాత్రమే ఉంటారు.ప్రస్తుతం నేను (ఒద్దుల రవిశేఖర్) ఆ బాధ్యతలు చూస్తున్నాను. స్నేహ ధర్మం,సహాయగుణం ఉన్న వారంతా సభ్యులే !
https://www.blogger.com/groups/friendfoundation/
 ఇలా ఎక్కడికక్కడ friendafoundations ఏర్పాటు చేసుకొని ఎక్కువ మంది ఈ మార్గం లోకి రావటానికి ప్రేరణ కలిగించటానికి ఈ బ్లాగ్ ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను . అందరు దీనిని సాదరంగా ఆహ్వానిస్తారని కోరుకుంటూ !
              మీ  ఒద్దుల రవిశేఖర్

No comments:

Post a Comment